గజేంద్రమోక్షం – లావొక్కింతయు లేదు – Gajendra Moksham

Most people do not understand the Telugu language in which this piece is written. This is a poem from the epic of “Gajendramoksham”. When I was a kid, I couldn’t get the emotions behind this poem, but later on when I started thinking on my own, my eyes filled with tears whenever I read or heard this padyam. I believe this poem will cause everyone a tinge of sorrow in their hearts at the plight of the elephant king and at the same filled with utmost devotion to the Ultimate Liberator, Sri Maha Vishnu.

ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్ళన్నీ స్లాబులే కానీ నేను పుట్టి పెరిగిన ఇల్లు పెంకుటిల్లు. పెంకుటిళ్ళకి వాసాలుంటాయి. వాసాలకి చీర వేళాడదీసి సులువుగా ఉయ్యాల వేసేవారు. ఉయ్యాలలో చిన్నపిల్లల్ని ఊపుతూ నిద్రపుచ్చేవారు. అలా నిద్రపుచ్చుతూ జోలపాటలు పాడేవారు.

మా చిన్నప్పుడు మా father మమ్మల్ని నిద్రపుచ్చుతూ పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివేవారట. అంచేత పద్యాలు ఊహ తెలియనప్పటినుంచి కూడా మనసు మూలల్లో ఎక్కడో నాటుకు పోయాయి. అందుకే బహుశా పద్యాలు విన్నప్పుడూ, చదువుకున్నప్పుడూ కాళిదాసన్న “జననాంతర సౌహృదాని”వంటి భావనేదో ఆవరిస్తుంది.


లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!

Translation of the above poem:

There is not an ounce of strength remaining in my muscles. All the courage I vested has drained off. Living tissues across my limbs, arms, are all dying. I am about to faint. My body is tired. It is demanding me to put excessive efforts to sustain further. There is no one for me; You are the only One I have! I surrender totally unto You! Please have mercy on this weakling of me! O Vishnu, the Savior of distressed! Is it not time yet for You to come? Will not You save me, my Lord? O Protector of all beings, kindly come and rescue me with Your Divine grace!”

గజేంద్రుడెవడు? నేనెవరిని? పద్యాన్ని ఎలుగెత్తి చదివితే ఎందుకు నా గుండె ద్రవిస్తుంది? అది నా బాధేనా అన్న అనుభూతి ఎందువల్ల? ఇదంతా అలోచిస్తే చాలా విచిత్రంగా తోస్తుంది! గజేంద్రుడు మొసలితో కొన్ని వేల యేళ్ళు యుద్ధం చేసాడట, ఇది సాధ్యమేనా? కాదు. అవును, ప్రతీకాత్మకంగా.

కష్టాలొచ్చినప్పుడు, ఒక నెల రోజులైనా, కొన్ని వేల సంవత్సరాల్లా గడవడం సాధరణ విషయమే. సమయంలో దేవుడి మీద నమ్మకం ఉన్నవారు (కొందరు లేనివారు కూడా కలిగించుకొని) ఇలా కుయ్యి పెట్టడం కుడా తెలిసిన విషయమే. పై అవస్థ దీనికి ప్రతీక.

మరొక రకంగా ఆలోచిస్తే, సమస్త మానవ జాతీ వేన వేల సంవత్సరాలుగా ఎదో ఒక సంఘర్షణ పడుతూనే ఉంది. అలాటి ఒకానొక సందర్భంలో దేవుడనే ఒక నమ్మకంపై ఆధారపడాల్సిన సన్నివేశం తటస్థించింది. పై అవస్థ దీనికి కూడా ప్రతీకే!

మా father తెలుగు పండితుడు కాదు, గొప్ప భక్తుడూ కాదు. అయినా పోతన భాగవత పద్యాలతనికి కంఠగతం, హృద్గతం. ఎలా? అది తెలుగు పద్యంలో, పోతన రచనలో ఉన్న గొప్పదనం. సామాన్య తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కొద్దిమంది కవులలో పోతన ఒకడు.  “రావే ఈశ్వర”, “కావవే వరద” అన్న పదాలలో నిండిన ఆర్తి అనితర సాధ్యం. పోతన భాగవతంలోని పద్యాలని మన పిల్లలకి అందించడం ఒక్కటీ చాలు, తెలుగుభాషని సంరక్షించుకోడానికి!

ఇక చోద్యం కి వద్దం.

అయినా విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా? ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ

ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని 

లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా

సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా

రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?

పోవో! సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో

పొగ చుట్టలెన్ని యైనను సిగరెట్టుకి సాటి రావు ….అన్నాడు శ్రీశ్రీ

Note: కాస్త “లంచ” మి స్తే చలం ని కూడా తిరగేయవచ్చు….

About the Author

Dr. K. Raja Gopal Reddy is a seasoned internationally qualified Insurance professional. What you are reading here, may not answer all the questions we have, but has the absolute power of asking unsettling questions which increase the interest in the strange world, and show the contradictory wonders lying just below the surface of the commonest things of life. Look at this disturbing but beautiful thought of Friedrich Nietzsche “God is dead. God remains dead. And we have killed him”.

Dr. Reddy can be reached at: raja66gopal@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *